

నాని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ది పారడైజ్ చిత్రం గురించి వస్తున్న తాజా ప్రచారం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, దసరా విజయానంతరం రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక్క కథతో ముగిసిపోదనే వార్తలు అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ‘ది పారడైజ్’ కథలో భవిష్యత్తులో రూపొందబోయే మరో చిత్రానికి సంబంధించిన సంకేతాలు ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి తో శ్రీకాంత్ ఓదెల చేయనున్న ప్రాజెక్ట్‌కు ఈ కథతో ఏదో రూపంలో సంబంధం ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. అదే నిజమైతే తెలుగు చిత్రసీమలో మరో కొత్త సినిమాటిక్ యూనివర్స్ ఆవిర్భవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, ‘ది పారడైజ్’ కథకు ముందున్న సంఘటనలను చూపించే ప్రీక్వెల్‌పై కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అధికారిక ప్రకటన వెలువడకపోయినా ఈ ప్రచారం అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!