

తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రస్తుతం వేగంగా ఎదుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్థాయిలో భారీ గుర్తింపు పొందాడు. ఆ సినిమా తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీ దేశవ్యాప్తంగా మరింత ప్రాధాన్యం సంపాదించింది. ప్రస్తుతం కూడా కొత్త రికార్డులను మన తెలుగు సినిమాలే సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాయి.
ఇదిలా ఉంటే, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది విడుదలైన రాజాసాబ్ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. దీంతో ఇప్పుడు దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఫౌజీ’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ లేదా గ్లింప్స్ ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే త్వరలోనే ఒక టీజర్ విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ టీజర్లో ప్రభాస్ చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తాడని దర్శకుడు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రభాస్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సమాచారం ప్రకారం, శ్రీ రామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ ప్లాన్ ప్రకారం జరిగితే ఈ సినిమాను దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!