

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ మరియు స్టార్ దర్శకుడు అట్లీ కలిసి చేస్తున్న కొత్త చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో దీపిక పదుకొనె, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది.
దీపిక పదుకొనె ఈ సినిమాలో ఎంతో స్టైలిష్ లుక్లో కనిపించనుందని, ఆమె ఒక లేడీ డాన్ పాత్రను పోషిస్తోందని టాక్ వినిపిస్తోంది. అలాగే మరో హీరోయిన్గా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఈ వివరాలు ఎంతవరకు నిజమో త్వరలో తెలుస్తుంది.
తదుపరి షెడ్యూల్లో అల్లు అర్జున్ – జాన్వీ కపూర్లపై ఒక ప్రేమ సన్నివేశాన్ని చిత్రీకరించనున్నట్లు సమాచారం. అనంతరం దీపిక షూటింగ్లో జాయిన్ అవుతుంది అని తెలుస్తోంది. అల్లు అర్జున్ కోసం అట్లీ శక్తివంతమైన కథను సిద్ధం చేసినట్లు టాక్. మొత్తం కథ మాఫియా నేపథ్యంతో, ఒక డాన్ చుట్టూ సాగుతుందని తెలుస్తోంది.
ఈ భారీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రత్యేక అతిథి పాత్రలను కూడా అట్లీ డిజైన్ చేస్తున్నాడని సమాచారం. ఆ పాత్రల కోసం ఎవరిని సంప్రదించనున్నాడో తెలియాల్సి ఉంది.







.png&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!