
జనరల్

రహస్య ఫొటోలు, వీడియోలను చూపిస్తూ ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి మూడేళ్లుగా డబ్బులు వసూలు చేసిన మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఖైరతాబాద్ ఏఎస్వో కార్యాలయంలో పనిచేస్తున్న కిరణ్కు సూరారం కాలనీకి చెందిన మహిళతో పరిచయం ఏర్పడి, అది క్రమంగా వివాహేతర సంబంధంగా మారింది. ఈ సమయంలో ఆమె ఫొటోలు, వీడియోలు తీసి, వాటితో అతడిని బెదిరించడం ప్రారంభించింది.
అంతేకాకుండా హోటల్ గదుల్లో కలిసిన సందర్భాల స్లిప్పులను సాక్ష్యాలుగా ఉంచుకుని డబ్బులు డిమాండ్ చేస్తూ వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ వేధింపులను భరించలేక చివరకు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!