

అమెరికాకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు, భక్తి గీతాల గాయకుడు కృష్ణదాస్ ముంబయిలో నిర్వహించిన ‘లైవ్ కీర్తన’ సంగీత కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆయన భారత పర్యటనలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమానికి భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మ హాజరయ్యారు. భారతీయ భక్తి సంగీతాన్ని ఆధునిక సంగీత శైలులతో మేళవిస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న కృష్ణదాస్ తన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమంలో అనుష్క శర్మ తన్మయత్వంతో కీర్తనలను ఆస్వాదిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల హాజరు కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. భక్తి సంగీతం, ఆధ్యాత్మిక వాతావరణం నిండిన ఈ కార్యక్రమానికి సంబంధించిన దృశ్యాలు నెటిజన్లలో ఆసక్తిని పెంచుతున్నాయి. కృష్ణదాస్ భారత పర్యటనలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సంగీత కచేరీలు భక్తి సంగీత ప్రియులను ఆకట్టుకుంటున్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!