
జనరల్

యాసంగి సీజన్‌లో దేశంలోనే అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేశామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఖరీఫ్, రబీ కలిపి 147 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇప్పటివరకు రూ.35 వేల కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
యాసంగిలో 8,575 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పారు. కేంద్రం ఇచ్చిన 52 లక్షల మెట్రిక్ టన్నుల టార్గెట్‌ను ఇప్పటికే దాటి 75 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, తెలంగాణ నుంచి కేంద్రం టార్గెట్‌ను ప్రతి సంవత్సరం తగ్గిస్తోందని ఆయన విమర్శించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!