
సినిమాలు

ఢిల్లీలో జర్నలిస్టులపై పోలీసులు దాడులకు పాల్పడిన వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు సీనియర్ పోలీస్ అధికారికి సమన్లు జారీ చేసింది. వివరణ ఇచ్చేందుకు సంబంధిత అధికారి నేరుగా కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది.
జర్నలిస్టులు, న్యాయవాదులు తమ వృత్తిపరమైన విధులను నిర్వర్తించకుండా అడ్డుకోవద్దని ధర్మాసనం పోలీసులను హెచ్చరించింది. విధుల నిర్వహణలో అనవసరమైన ఆటంకాలు కల్పించకూడదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తదుపరి విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!