

చికిత్స కోసం అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలన్న గునిగటి రవీందర్‌రావు విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అమెరికా స్థాయి వైద్య సేవలు భారత్‌లో కూడా అందుబాటులో ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. శీస సంతోష్ ఫిర్యాదు మేరకు 2014 అక్టోబరు 12న నమోదైన కేసులో రవీందర్‌రావుపై భారతీయ శిక్షాస్మృతి 120-బి, 306తో పాటు 34వ సెక్షన్ల కింద కేసు నమోదైంది. అనంతరం 2016 ఫిబ్రవరి 29న అభియోగ పత్రం దాఖలైంది.
విచారణకు హాజరుకాకపోవడంతో రవీందర్‌రావుపై బెయిల్ రహిత అరెస్టు వారెంట్, గాలింపు నోటీసు జారీ అయ్యాయి. 2016లో గాలింపు నోటీసు నిలిపివేత ఉత్తర్వులను ఆసరాగా చేసుకుని ఆయన 2017లో అమెరికా వెళ్లినట్లు న్యాయస్థానం పేర్కొంది. తిరిగి 2025 ఏప్రిల్ 19న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోగానే పోలీసులు అరెస్టు చేశారు. అభియోగ పత్రం దాఖలై దాదాపు పదేళ్లు గడిచినా విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడంపై జస్టిస్ దీపాంకర్ దత్త, జస్టిస్ సతీశ్ చంద్రశర్మల ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!