
సినిమాలు

హైదరాబాద్ అమీర్‌పేట్‌లోని ఓ గర్ల్స్ హాస్టల్‌పై యువతి చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. లేడీస్ హాస్టల్ ముసుగులో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆమె వీడియో విడుదల చేసింది. గతేడాది తాను ఆ పీజీలో చేరానని, కానీ అక్కడి పరిస్థితుల కారణంగా కేవలం పదిహేను రోజుల్లోనే బయటకు వచ్చేసినట్లు తెలిపింది.
హాస్టల్‌లో సరైన వసతులు లేవని, ఆహారం కూడా సరిగా అందించరని ఆమె ఆరోపించింది. అంతేకాకుండా హాస్టల్ ఓనర్ తరచూ అమ్మాయిల గదుల్లోకి వస్తాడని, దీనిపై ప్రశ్నిస్తే బెదిరించేవారని పేర్కొంది. తన ఫోన్ నంబర్ కూడా అడిగాడని, అక్కడ అమ్మాయిలను అబ్బాయిలకు సప్లై చేస్తారనే మాటలు వినిపించేవని సంచలన వ్యాఖ్యలు చేసింది. హాస్టల్ నిర్వహకులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!