
రాజకీయాలు

ఈ నెల 12న ఢిల్లీకి రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ముఖ్య కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం పలికారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు, టీపీసీసీ ముఖ్య నాయకులను ఆయన ఆహ్వానించారు.
ఢిల్లీలో జరిగే ఏఐసీసీ నిరసన కార్యక్రమానికి ఆహ్వానించిన నాయకులంతా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రేవంత్ రెడ్డి కోరినట్లు సమాచారం. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ నిరసనలో తెలంగాణకు చెందిన పార్టీ ముఖ్య ప్రతినిధులు పాల్గొనేలా ఆయన ఈ పిలుపునిచ్చారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!