16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

Writer: Pooja 06:30 AM, 16 అక్టోబర్, 2026
అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్రం అరోరా ప్రాంతంలో హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర పన్నిన 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అలెగ్జాండ్రోస్‌ పపోరాకిస్‌ అనే నిందితుడి ఇంటి నుంచి రైఫిల్‌, పెద్ద సంఖ్యలో తూటాలు, మ్యాగజైన్లు, తీవ్రవాద భావజాలానికి సంబంధించిన సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పాలటైన్‌కు చెందిన అతడు ఓ రెస్టారెంట్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. తీవ్రవాద భావజాలంతో ప్రభావితమై, హిందువులపై ద్వేషంతో ఈ నెల 11న ఆలయంలో కాల్పులు జరపాలని పథకం వేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

సెలవుదినం కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అయితే, కాల్పులకు ఉపయోగించాలనుకున్న రైఫిల్‌ పనిచేయకపోవడంతో నిందితుడి ప్రయత్నం విఫలమైందని, అనంతరం అతడు ఇంటికి తిరిగి వెళ్లినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కుట్ర తీవ్ర కలవరానికి గురిచేసిందని అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైస్వాల్‌ పేర్కొన్నారు. అమెరికాలో భారతీయుల భద్రతతో పాటు హిందూ దేవాలయాల రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రైల్వే శాఖకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ట్యాగ్లు
హిందూ దేవాలయంఅమెరికా వార్తలుఆలయ భద్రతభారత అమెరికా సంబంధాలుఇల్లినాయిస్విదేశాంగ శాఖ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల
బిజినెస్

విప్రో లాభాల్లో స్వల్ప తగ్గుదల

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి
బిజినెస్

టెక్ మహీంద్రా లాభాల్లో భారీ వృద్ధి

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా –  కవిత
రాజకీయాలు

సీఎంవోలో 15 శాతం కమీషన్ల అడ్డా – కవిత

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?
బిజినెస్

నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి చేరిన విద్యుత్ డిమాండ్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు
బిజినెస్

జియో ఆదాయ వ్యూహంలో కీలక మార్పులు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు
సినిమాలు

విజయ్‌ దేవరకొండ రణబాలిపై నాని ప్రశంసలు

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం
జనరల్

తెలంగాణలో పెట్టుబడులకు తమిళ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం
జనరల్

అమెరికాలో హిందూ ఆలయంపై దాడి కుట్ర భగ్నం

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు
జనరల్

భూమి ఆరోగ్యానికి ముప్పుగా మారిన వాతావరణ మార్పులు

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్
జనరల్

ఇమ్రాన్ ఖాన్‌కు ఎఫ్‌ఆర్‌ఆర్‌వో షాక్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం
జనరల్

పుష్కరాల బడ్జెట్‌పై ఎఫ్‌జీజీ అభ్యంతరం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!