
గాసిప్స్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారత ప్రభుత్వం ఆమోదంతో NEET (UG) 2026 పునఃపరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షను 2026 జూన్ 21వ తేదీ ఆదివారం నిర్వహించనున్నట్లు వెల్లడించింది. పరీక్షకు సంబంధించిన సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక NTA కమ్యూనికేషన్ ఛానళ్లను మాత్రమే నమ్మాలని సూచించింది.

సోషల్ మీడియా మరియు అనధికారిక వేదికల్లో ప్రచారమవుతున్న తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దని NTA హెచ్చరించింది. పరీక్షకు సంబంధించిన వివరాల కోసం అభ్యర్థులు neet-ug@nta.ac.in ఈమెయిల్ లేదా 011-69227700 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!