

భారత వైమానిక దళం వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. మరో ఐదు S-400 సుదర్శన్ దీర్ఘశ్రేణి ఎయిర్ డిఫెన్స్ స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత్ జారీ చేసిన టెండర్‌కు రష్యా సమగ్ర ప్రతిపాదనను సమర్పించింది. ఈ ప్రాజెక్టు విలువ రూ.50,000 కోట్లకు పైగా ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి. రష్యా ప్రతిపాదనను ప్రస్తుతం భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది.
2018లో కుదిరిన తొలి ఒప్పందంలోని ఐదు S-400 స్క్వాడ్రన్లలో నాలుగు ఇప్పటికే భారత్‌కు చేరగా, ఐదో స్క్వాడ్రన్ ఈ ఏడాది నవంబర్ నాటికి అందే అవకాశం ఉంది. కొత్త ఒప్పందం ఖరారైతే సిస్టమ్‌ల సరఫరా ఒప్పందం కుదిరిన సుమారు మూడేళ్ల తర్వాత ప్రారంభమయ్యే అవకాశముంది. ఆపరేషన్ సింధూర్ అనంతరం తూర్పు, పశ్చిమ సరిహద్దుల్లో వైమానిక రక్షణను బలోపేతం చేసేందుకు మరో ఐదు స్క్వాడ్రన్ల కొనుగోలుకు భారత్ ఆమోదం తెలిపింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!