

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతుండగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా షేర్ చేసిన ఓ ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కలిసి ఉన్న ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో సందీప్ రెడ్డి వంగా డ్రింక్ బాటిల్ తెరుస్తూ కనిపించగా, పక్కనే ఉన్న ప్రభాస్ చిరునవ్వుతో పోజులిచ్చారు. ‘Spirits Are High’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫొటో అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమా కోసం ఎదురుచూస్తున్న అభిమానులు ఈ ఫొటోపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సరదా క్షణం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది.
‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగా.. ‘స్పిరిట్’లో ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఇదిలా ఉండగా, ఈ సినిమా విడుదల తేదీలో మార్పు చోటుచేసుకున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. తొలుత 2027 మార్చి 5న విడుదల చేయాలని భావించినప్పటికీ, తాజా షెడ్యూల్ ప్రకారం 2027 అక్టోబర్ 29న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందోనని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!