

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి కాంగ్రెస్ ఆమోదం మాత్రమే మిగిలి ఉంది. అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవం సందర్భంగా ట్రంప్ చిత్రంతో ప్రత్యేక బంగారు నాణెం విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా 250 డాలర్ నోటుకు సంబంధించిన ప్రోటోటైప్ నమూనాలను సిద్ధం చేయాలని అమెరికా బ్యూరో ఆఫ్ ఎంగ్రేవింగ్ అండ్ ప్రింటింగ్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు నివేదికలు చెబుతున్నాయి. 1866 తర్వాత జీవించి ఉన్న వ్యక్తి చిత్రంతో అమెరికా కరెన్సీ రాకపోవడం విశేషం.
ఇదిలా ఉండగా, అమెరికాలో నిరుద్యోగ దరఖాస్తులు గత వారం 2,15,000కి చేరినట్లు కార్మిక శాఖ తెలిపింది. అంతక్రితం వారంలో ఇవి 2,10,000గా నమోదయ్యాయి. అలాగే 2025 ఏప్రిల్‌తో పోలిస్తే గత నెలలో అమెరికాలో ద్రవ్యోల్బణం 3.8%కి పెరిగి మూడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరినట్లు సమాచారం. ఈ గణాంకాలు అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!