
ఓటీటీ

ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం హైదరాబాద్‌ను అతలాకుతలం చేసింది. నగరంలోని పలు ప్రాంతాల్లో చెట్లు విరిగిపడగా, బోర్డులు, హోర్డింగులు గాలులకు ఎగిరిపడ్డాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రంతా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలు కాలనీలు చీకట్లోనే గడపాల్సి వచ్చింది.
భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదనీరు చేరి నీటిమునిగిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పాటు ప్రజల రాకపోకలు కూడా ప్రభావితమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది రాత్రంతా సహాయక చర్యలు చేపట్టి, నీటిని తొలగించడం, కూలిపోయిన చెట్లను తొలగించడం వంటి పనులు నిర్వహించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!