

తెలంగాణలో 315 మండలాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వానికి వివరించారు. రైతులను ఆదుకునేందుకు సూక్ష్మ సేద్యం, మధ్యంతర పంటల విత్తనాల కోసం తక్షణమే సహాయం అందించాలని కోరారు. కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నిర్వహించిన ‘ఖేత్ బచావో అభియాన్’ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న తుమ్మల, రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.
మొక్కజొన్న, జొన్నతో పాటు ఇతర పంటలకు 100 శాతం కనీస మద్దతు ధర కల్పించాలని తుమ్మల విజ్ఞప్తి చేశారు. ధరల మద్దతు పథకం కింద అమలులో ఉన్న 25 శాతం కొనుగోలు పరిమితిని తొలగించాలని కోరారు. రసాయన ఎరువుల ధరలు, రాయితీలను హేతుబద్ధీకరించాలని సూచించారు. అలాగే వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడం, నీటి సంరక్షణ పనులకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా రైతులకు, గ్రామీణ ప్రజలకు మరింత మేలు చేయాలని కేంద్రాన్ని కోరారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!