

దిల్లీకి చెందిన ‘క్యారీమెన్’ అనే స్టార్టప్ సంస్థ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. రద్దీగా ఉండే మార్కెట్లలో షాపింగ్ చేసే వారికి సహాయం చేసేందుకు ఈ సంస్థ ప్రత్యేక సేవలను అందిస్తోంది. షాపింగ్ సమయంలో సంస్థ సిబ్బంది వినియోగదారులతో పాటు తిరుగుతూ బ్యాగులు మోయడం, ఫుడ్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడడం, పార్కింగ్ ప్రాంతం లేదా మెట్రో స్టేషన్ వరకు వెంట రావడం వంటి సేవలను అందిస్తున్నారు. అదనంగా మొబైల్ ఛార్జింగ్, గొడుగు, మడత కుర్చీ, బేబీ క్యారియర్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఈ సేవల కోసం గంటకు రూ.149 వసూలు చేస్తున్నారు. అయితే, ఈ కాన్సెప్ట్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని సరదాగా తీసుకుంటుండగా, మరికొందరు మానవ వనరులను ఇలాంటి పనులకు వినియోగించడం సరైనదేనా అని ప్రశ్నిస్తున్నారు. కార్మికులకు నిజంగా ఎంత వేతనం అందుతుందనే అంశంపై కూడా నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!