

అమెరికాలోకి దిగుమతి అయ్యే వివిధ దేశాల వస్తు, సేవలపై మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విధించిన 10 శాతం అదనపు సుంకాలు చట్ట విరుద్ధమని న్యూయార్క్‌లోని అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం తీర్పు వెలువరించింది. చిన్న వ్యాపార సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం 2-1 తేడాతో ఈ నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా అదనపు సుంకాలు విధించలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
వాణిజ్య చట్టం-1974లోని సెక్షన్ 122 ప్రకారం అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తాత్కాలిక సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడికి ఉంటుందని న్యాయస్థానం తెలిపింది. ఇప్పటికే అదనపు సుంకాల రూపంలో వసూలు చేసిన డబ్బును ఐదు రోజుల్లోగా తిరిగి చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ తీర్పుపై ఉన్నత న్యాయస్థానంలో అప్పీల్ చేయాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. సుంకాల రీఫండ్‌కు సుమారు మూడు లక్షల ముప్పై వేల దిగుమతిదారులు అర్హులని అమెరికా సరిహద్దు రక్షణ విభాగం గుర్తించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!