

కృత్రిమ మేధ (ఏఐ) నియంత్రణకు సంబంధించి నెల రోజుల్లోగా సంప్రదింపుల చర్చాపత్రాన్ని విడుదల చేయనున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఏఐ భద్రత, డీప్‌ఫేక్‌ల ముప్పు, మానవ కేంద్రీకృత విధానం, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక అంశాలకు ఇందులో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. కృత్రిమ మేధ వినియోగానికి సంబంధించి భారత్‌కు తగిన విధానపరమైన నిబంధనలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
‘ప్రపంచ అభివృద్ధి నివేదిక’ విడుదల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వైష్ణవ్ మాట్లాడుతూ.. ఏఐ వినియోగంలో భద్రతకు ప్రాధాన్యమిస్తూ నియంత్రణ ఆధారిత చర్చాపత్రాన్ని రూపొందించాలని సంబంధిత విభాగాన్ని కోరనున్నట్లు తెలిపారు. డీప్‌ఫేక్‌లు సమాజంలో తీవ్ర సమస్యలను సృష్టించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. వాటి నాణ్యత రోజురోజుకూ మెరుగుపడుతుండటంతో, ఏఐ వల్ల కలిగే హానికర ప్రభావాలను నియంత్రించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!