

బహిరంగ ప్రదేశాలు, ఉత్సవాలు, వేడుకల్లో అశ్లీలత, ద్వంద్వార్థాలు లేదా కులాలను కించపరిచే అంశాలు ఉన్న పాటల ప్రదర్శనపై బిహార్ ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. ఇటువంటి పాటలు సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్నాయని భావించిన ప్రభుత్వం, వాటి ప్రదర్శన మరియు ప్రసారంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర కళలు, సాంస్కృతిక శాఖ సంబంధిత అధికారులకు ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన ఆదేశాల ప్రకారం, జానపద సంస్కృతి పేరుతో అభ్యంతరకర గీతాలు విస్తృతంగా ప్రాచుర్యం పొందుతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇటువంటి పాటలు అశ్లీలత, సామాజిక విభేదాలు, ద్వేష భావాలను ప్రోత్సహించే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు అసౌకర్యానికి గురవుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఇటువంటి పాటలను ప్రదర్శించినా, ప్రసారం చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!