
రాజకీయాలు

జనగామ జిల్లా ఘనపూర్ (స్టేషన్) నియోజకవర్గం చిల్పూర్ మండలం పల్లగుట్ట గ్రామంలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 33/11 కేవీ సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేయడంతో పాటు పలు సబ్‌స్టేషన్లను ప్రారంభించారు.
టీజీఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో రూ.60.62 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ పనుల ద్వారా 60,838 మంది వినియోగదారులకు ప్రయోజనం చేకూరనుంది. పీచరలో రూ.43.92 కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ ప్రారంభించగా, పల్లగుట్ట, లింగంపల్లి, నష్కల్ గ్రామాల్లో కొత్త సబ్‌స్టేషన్లకు శంకుస్థాపన చేశారు. రైతులు, గృహ వినియోగదారులకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!