
జనరల్

హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న ఆర్బర్ ఇంటర్నేషనల్ స్కూల్కు చెందిన 96 మంది విద్యార్థులు అమృత్సర్ పర్యటనకు వెళ్లారు. అయితే, పంజాబ్లోని రూప్నగర్లో రైతులు చేపట్టిన ఆందోళన కారణంగా వారి ప్రయాణానికి అంతరాయం ఏర్పడింది. దీంతో విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయినట్లు సమాచారం.
పర్వీందర్ సింగ్ హత్యకు నిరసనగా రైతులు ఆందోళన చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ నిరసనల ప్రభావంతో విద్యార్థులు ముందుకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం విద్యార్థుల పరిస్థితి, ఆందోళన ఎంతసేపు కొనసాగనుంది, వారిని సురక్షితంగా తిరిగి తీసుకువచ్చేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!