
గాసిప్స్

రామోజీ ఫిల్మ్ సిటీలో వారణాసి టైటిల్ లాంచ్ తర్వాత, టీమ్ మరో ట్విస్ట్ ఇచ్చింది. షూట్ ఇంకా ఎక్కువ భాగం మిగిలి ఉన్నప్పటికీ, మహేష్ బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కలిసి ముందుగానే ఇంటర్వ్యూలు చేశారు. రాజమౌళి సినిమాలు సాధారణంగా చివరి దశ వరకు సైలెంట్‌గా ఉంటాయి, కానీ ఈసారి హైప్ ముందే మొదలైంది. ఇంటర్వ్యూల రోజు ముగ్గురి బ్లాక్ లుక్ వైరల్ అయ్యింది. ప్రియాంక బ్లాక్ టాప్‌తో నెట్ ఫ్లోరల్ స్కర్ట్, పృథ్విరాజ్ పూర్తిగా బ్లాక్ ఔట్ఫిట్, మహేష్ బ్లాక్ షర్ట్‌తో బ్లూ ప్యాంట్ వేసుకున్నారు. ప్రియాంక ఫోటోలు పోస్ట్ చేస్తూ, రిలీజ్‌కు ఏడాది ముందు ఇంటర్నేషనల్ మీడియాలో ప్రమోట్ చేయడం ఎగ్జైటింగ్‌గా ఉందని చెప్పింది. చివరగా “జై శ్రీరామ్” అని రాసి #వారణాసి ట్యాగ్ చేసి అభిమానుల్లో కుతూహలం పెంచింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!