

అంతరిక్షం పై ఆసక్తి ఉన్నవారికి ఇది ఒక ఆసక్తికరమైన వార్త. ఈ రోజు (జనవరి 8 న) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ఈ ఏడాదికి తొలి స్పేస్‌వాక్ జరగనుంది అని నాసా ప్రకటించింది. ఈ స్పేస్‌వాక్‌లో నాసా వ్యోమగాములు మైక్ ఫిన్కే, జెనా కార్డ్‌మన్ పాల్గొననున్నారు. మైక్ ఫిన్కేకు ఇది 10 వ స్పేస్‌వాక్ కాగా, జెనా కార్డ్మన్కు ఇదే తొలి స్పేస్‌వాక్ కావడం విశేషం.
ఈ స్పేస్‌వాక్ ఉదయం 8 గంటలకు ప్రారంభమై (భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 PM IST), సుమారు ఆరు నర గంటల పాటు కొనసాగనుంది. ఈ సమయంలో ISS పవర్ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయడం, కొత్త సోలార్ ప్లేట్లకు కేబుల్స్ అమర్చడం, జంపర్ కేబుల్స్ ఇన్స్టాల్ చేయడం వంటి పనులు చేపడతారు.
అదే కాకుండా అంతరిక్ష కేంద్రాని కి సంబంధించిన హార్డ్‌వేర్ ఫోటోలు తీయడం, అలాగే కేంద్రం బయట ఉన్న సూక్ష్మజీవుల నమూనాలను సేకరించడం వంటి ముఖ్యమైన పనులు కూడా నిర్వహిస్తారు. ఈ స్పేస్‌వాక్ ను నాసా యాప్, నాసా యూట్యూబ్ ఛానల్, నాసా టీవీ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోలో లైవ్‌గా వీక్షించవచ్చు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!