

భారత సంతతికి చెందిన 25 ఏళ్ల యువ పారిశ్రామికవేత్త అమన్ సాంగర్.. కృత్రిమ మేధస్సు ఆధారిత కోడింగ్ ప్లాట్‌ఫామ్ కర్సర్‌ను రూపొందించిన ఎనీస్ఫియర్ సహ వ్యవస్థాపకుల్లో ఒకరు. న్యూయార్క్‌లో పెరిగిన ఆయన 14 ఏళ్ల వయసులోనే కోడింగ్ ప్రారంభించారు. మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో చదువుతున్న సమయంలో మైఖేల్ ట్రుయెల్, సులేహ్ ఆసిఫ్, అర్విడ్ లున్నెమార్క్‌లను కలుసుకున్నారు. 2022లో ఎంఐటీ నుంచి వైదొలిగి ఎనీస్ఫియర్‌పై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. గూగుల్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్‌లో ఇంటర్న్‌షిప్‌లతో పాటు కృత్రిమ మేధస్సు కన్సల్టింగ్ సంస్థను కూడా నిర్వహించారు. ఎనీస్ఫియర్‌ను సుమారు 60 బిలియన్ డాలర్ల విలువైన ఆల్-స్టాక్ డీల్‌లో కొనుగోలు చేసేందుకు స్పేస్‌ఎక్స్ ఒప్పందం చేసుకోగా, ఈ కొనుగోలు ఆగస్టు 2026లో పూర్తయింది.
మైక్రోసాఫ్ట్‌కు చెందిన విజువల్ స్టూడియో కోడ్ ఆధారంగా ప్రారంభమైన ఎనీస్ఫియర్ టూల్.. ఆ తర్వాత కృత్రిమ మేధస్సుకు ప్రాధాన్యమిచ్చే కోడింగ్ ఎడిటర్‌గా కర్సర్‌గా రూపాంతరం చెందింది. డెవలపర్ల రోజువారీ వర్క్‌ఫ్లోలో నేరుగా పనిచేస్తూ కోడ్‌బేస్‌లను విశ్లేషించడం, లోపాలను గుర్తించి సరిచేయడం, కోడ్‌ను రూపొందించడం, ఒకేసారి అనేక లైన్లలో మార్పులు చేయడం వంటి పనుల్లో కర్సర్ సహాయపడుతుంది. స్పేస్‌ఎక్స్‌తో కుదిరిన భారీ ఒప్పందంతో అమన్ సాంగర్ ప్రపంచ సాంకేతిక రంగంలో గుర్తింపు పొందారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!