
క్రీడలు

డిస్కస్ త్రోయర్ భన్వీర్ సింగ్ డోపింగ్ పరీక్షలో విఫలమవడంతో జాతీయ డోపింగ్ నిరోధక అప్పిలేట్ ప్యానెల్ అతనిపై ఏడేళ్ల నిషేధం విధించింది. 37 ఏళ్ల భన్వీర్ సింగ్ తన కెరీర్లో పెద్దగా గుర్తింపు పొందకపోయినా, 2022లో భువనేశ్వర్లో జరిగిన ఇండియన్ గ్రాండ్ ప్రీలో రెండో స్థానం సాధించాడు.
మరోవైపు లాంగ్ డిస్టెన్స్ రన్నర్ హరేంద్ర కుమార్ పై వరుసగా రెండోసారి నాలుగేళ్ల నిషేధం విధించారు. క్రీడల్లో నిషేధిత పదార్థాల వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయని ఈ నిర్ణయాలు సూచిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!