

ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ముంబయి ఇండియన్స్ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హెడ్‌కోచ్ మహేల జయవర్దనే తన బాధ్యతల నుంచి వైదొలిగారు. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ముంబయి ఇండియన్స్ తరఫున ఎక్స్‌లో ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. జట్టుకు ఆయన అందించిన సేవలను కొనియాడింది. హెడ్కోచ్గానే కాకుండా ముంబయి కుటుంబంలో ముఖ్యమైన వ్యక్తిగా ఆయన కొనసాగారని పేర్కొంది. దశాబ్దకాలంగా ఫ్రాంచైజీతో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని మహేల తెలిపారు. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది సహకారంతో పాటు అభిమానులు అందించిన మద్దతును ఎప్పటికీ మర్చిపోలేనని పేర్కొంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
2017లో ముంబయి ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మహేల.. 2017, 2019, 2020 సీజన్లలో జట్టు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం ఇతర బాధ్యతలు నిర్వహించిన ఆయన 2024లో మళ్లీ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన సేవలను ప్రశంసించిన ఫ్రాంచైజీ యజమాని నీతా అంబానీ.. జట్టు పట్ల ఆయన చూపిన నిబద్ధత, ఆటపై ఉన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు, ఐదుసార్లు ముంబయికి టైటిళ్లు అందించిన రోహిత్ శర్మకు మళ్లీ కెప్టెన్సీ అప్పగిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2024 నుంచి హార్దిక్ పాండ్య జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. 2025లో ముంబయి ప్లేఆఫ్స్‌లో ఆడగా, 2026లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, 2027 సీజన్ కెప్టెన్సీపై జట్టు యాజమాన్యం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!