
క్రీడలు

భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై ప్రస్తుతం భారీ చర్చ జరుగుతోంది. అతడిని ముంబై జట్టు విడుదల చేసే అవకాశముందనే వార్తలతో పలువురు జట్లు ఇప్పటికే సంప్రదింపులు ప్రారంభించినట్లు సమాచారం. దక్షిణ భారతానికి చెందిన ఒక జట్టు, ఉత్తర భారతానికి చెందిన మరో జట్టు హార్దిక్‌ను తమ జట్టులోకి తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణ భారత జట్టుగా చెన్నై జట్టుపై ఎక్కువగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఢిల్లీ జట్టు అనుభవజ్ఞుడైన నాయకత్వ ఆటగాడి కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో హార్దిక్‌పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. అలాగే కోల్‌కతా, లక్నో జట్లు కూడా హార్దిక్ కోసం పోటీలోకి దిగే అవకాశముందని క్రీడా వర్గాల్లో చర్చ జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!