

ఐపీఎల్ సీజన్ ఉత్కంఠభరిత పోరాటాల తర్వాత క్లైమాక్స్‌కు చేరుకుంది. నేటి నుంచి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ప్రారంభం కానుండగా, క్వాలిఫయర్-1లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకోనుండగా, ఓడిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది. దీంతో ఈ పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో క్వాలిఫయర్-1 విజేతే ఎక్కువసార్లు టైటిల్ గెలిచిన సెంటిమెంట్ మళ్లీ చర్చనీయాంశమైంది.
2011లో ప్లేఆఫ్స్ విధానం ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకు 15 సీజన్లు జరగ్గా, అందులో 12 సార్లు క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టే ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్, ఆర్సీబీ వంటి జట్లు ఈ సెంటిమెంట్‌ను నిజం చేశాయి. అయితే 2013, 2016, 2017 సీజన్లలో మాత్రం క్వాలిఫయర్-1లో ఓడిన జట్లు తిరిగి ఫైనల్‌కు చేరి టైటిల్ సాధించాయి. ఈ చరిత్రను చూస్తే నేటి మ్యాచ్ విజేతపై అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!