

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-A కీలక మ్యాచ్‌లో ఆదివారం కొలంబో వేదికగా తలపడనున్నాయి. రెండు జట్లూ మంచి ఫామ్‌లో ఉండటంతో ఈ మ్యాచ్‌పై ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.
భారత్ జట్టు ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌పై ఉన్న విజయ రికార్డును కొనసాగించాలని చూస్తుండగా, పాకిస్థాన్ జట్టు కూడా వరుస విజయాలతో ఆత్మవిశ్వాసంగా బరిలోకి దిగుతోంది. వర్షం ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ మ్యాచ్‌పై ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు.
అంచనా ప్లేయింగ్ XIలు: భారత్ – అభిషేక్ శర్మ/సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, రింకు సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
పాకిస్థాన్ – ఫర్హాన్, సయిమ్ అయూబ్, ఆఘా సల్మాన్ (కెప్టెన్), బాబర్ ఆజమ్, షాదాబ్ ఖాన్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్ అష్రాఫ్, నవాజ్/సల్మాన్ మీర్జా, షహీన్ అఫ్రిది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!