

IND vs SA ODI Series 2025: లైవ్ బ్రాడ్కాస్ట్ & స్ట్రీమింగ్ ఈ సిరీస్‌కి KL రాహుల్‌ని కెప్టెన్‌గా నియమించారు, ఎందుకంటే శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరూ గాయాల వల్ల బయటకు వెళ్లారు. గిల్ ఇప్పటికీ మెడ గాయం నుంచి కోలుకుంటుండగా, అయ్యర్ ఆస్ట్రేలియా టూర్లో వచ్చిన అబ్డామినల్ ఇంజురీ నుంచి రిహాబ్‌లో ఉన్నాడు. గత టూర్ మిస్సయిన రిషబ్ పంత్ ఈసారి జట్టులోకి తిరిగి వస్తున్నాడు.
ఇటీవలే దక్షిణాఫ్రికాతో జరిగిన హోమ్ టెస్ట్ సిరీస్‌లో 0-2 తేడాతో ఓటమిపాలైన భారత్, నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే మూడు వన్డేల సిరీస్ కోసం సిద్ధమవుతోంది. రాంచి, రాయ్‌పూర్, విశాఖపట్నంలో మ్యాచ్‌లు జరగనున్నాయి. టెంబా బవుమా నేతృత్వంలోని దక్షిణాఫ్రికా, భారత్‌ను ఓడించి వన్డేల్లో ఆధిపత్యం సాధించాలని చూస్తోంది.
IND vs SA ODI Squad 2025: భారత్ జట్టును ఈసారి కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా నడిపించనున్నాడు. అతనితో పాటు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, ప్రసిద్ కృష్ణ, తిలక్ వర్మ, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురేల్ ఈ వన్డే సిరీస్ కోసం ఎంపికయ్యారు. మొత్తంగా యువత, అనుభవజ్ఞుల కలయికగా ఈ భారత స్క్వాడ్ కనిపిస్తోంది.
దక్షిణాఫ్రికా జట్టు 2025 – ODI సిరీస్: టెంబా బవుమా (కెప్టెన్), ఓట్ట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బోష్, మాథ్యూ బ్రీట్జ్కీ, డెవాల్డ్ బ్రేవిస్, నాంద్రే బర్గర్, క్వింటన్ డి కాక్, రూబిన్ హెర్మన్, కేశవ్ మహరాజ్, టోనీ డి జోర్జి, రియన్ రికెల్టన్, మార్కో జాన్సెన్, ఐడెన్ మార్క్రామ్, లుంగీ ఎంగిడి, ప్రెనెలాన్ సుబ్రయెన్. భారత్–దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ మొత్తం స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో ప్రసారం అవుతుంది. అలాగే మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్‌ను జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్సైట్లో చూడొచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!