
క్రీడలు

కేప్ వెర్డే జట్టు అనుభవజ్ఞుడైన గోల్‌కీపర్ వోజిన్హా 2026 ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఒక్క మ్యాచ్‌తోనే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. నిన్న జరిగిన హెచ్ గ్రూప్ తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై అద్భుతంగా రాణించిన 40 ఏళ్ల వోజిన్హా ఏకంగా 8 కీలక సేవ్‌లు చేసి తన జట్టుకు 0-0తో విలువైన డ్రా అందించారు.
మ్యాచ్‌కు ముందు ఆయన సామాజిక మాధ్యమ ఖాతాలో సుమారు 50 వేల మంది అనుచరులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ ప్రదర్శన తర్వాత ఆయనకు భారీగా ఆదరణ లభించింది. బ్రెజిల్‌కు చెందిన ప్రముఖ ప్రసార వేదిక ప్రేక్షకులను ఆయనకు మద్దతు ఇవ్వాలని కోరడంతో కొన్ని గంటల్లోనే అనుచరుల సంఖ్య 43 లక్షలు దాటింది. దీంతో వోజిన్హా ప్రపంచకప్‌లో అత్యంత చర్చనీయాంశమైన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!