

బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన నితిన్ నబీన్‌కు కేంద్ర ప్రభుత్వం జడ్-ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించింది. ఈ భద్రతా వ్యవస్థ కింద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) కమాండోలు ఆయనకు రక్షణగా ఉంటారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు, నితిన్ నబీన్ దేశవ్యాప్తంగా పర్యటించేటప్పుడు, బహిరంగ సభల్లో పాల్గొనేటప్పుడు, అలాగే ఆయన నివాసం వద్ద 24 గంటలూ సీఆర్పీఎఫ్ సిబ్బంది భద్రత కల్పించనున్నారు.
45 ఏళ్ల వయసులో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికైన నితిన్ నబీన్, ఈ పదవిని స్వీకరించిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాకు కూడా జడ్-ప్లస్ భద్రతే కేటాయించారు. వీఐపీ భద్రతా వ్యవస్థలో జడ్-ప్లస్ అత్యున్నత కేటగిరీగా ఉండగా, జడ్, వై-ప్లస్, వై, ఎక్స్ వంటి ఇతర కేటగిరీలు ఉన్నాయి. ప్రస్తుతం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గాంధీ కుటుంబ సభ్యులతో సహా సుమారు 200 మంది వీఐపీలకు సీఆర్పీఎఫ్ భద్రత కల్పిస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!