
రాజకీయాలు

డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ తమను వెన్నుపోటు పొడిచిందని ఆరోపించారు. గత 20 ఏళ్లుగా డీఎంకేపై ఆధారపడి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు అధికార ఆశతో ప్రత్యర్థులతో చేతులు కలిపిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్టీ కార్యకర్తలు ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు.
దేశంలో భాజపా విజయాలకు కేవలం ప్రధాని మోదీ, అమిత్ షాలే కారణమని తాను భావించేవాడినని, కానీ కాంగ్రెస్ నేతల అసమర్థత కూడా ప్రధాన కారణమని ఇప్పుడు స్పష్టమైందని ఉదయనిధి పేర్కొన్నారు. డీఎంకేతో పొత్తు వల్లే కాంగ్రెస్‌కు గతంలో రాజ్యసభ, అసెంబ్లీ స్థానాలు లభించాయని గుర్తు చేశారు. తాజా ఎన్నికల తర్వాత పార్టీ వ్యూహాల్లో మార్పులు తీసుకురావాలని డీఎంకే కార్యకర్తలకు పిలుపునిచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!