
టెక్నాలజీ

ఏపీలో వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే కూటమి ప్రభుత్వ హయాంలో క్రైమ్ రేటు 6 శాతం తగ్గిందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అసెంబ్లీలో హోంశాఖ బడ్జెట్ డిమాండ్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సైబర్ నేరాల నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.
అలాగే వైకాపా కార్యకర్తలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి హెచ్చరించారు. శాంతిభద్రతలను భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!