
జనరల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకు వచ్చిన మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమాతో రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఉదయం అమరావతిలోని ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన లాల్దుహోమాకు మంత్రి లోకేష్ సాదరంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి లోకేష్ వివరించారు. అనంతరం మిజోరం ముఖ్యమంత్రి లాల్దుహోమాను శాలువాతో సత్కరించి, యువగళం పాదయాత్రకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ భేటీ మర్యాదపూర్వకంగా సాగింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!