

సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ (CJP) న్యాయ వ్యవహారాల విభాగం అధిపతి రత్నా సింగ్.. పార్టీ సభ్యులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కోర్టు హాజరుపై ఆందోళన వ్యక్తం చేశారు. వీరిద్దరి న్యాయ నిర్బంధ గడువు నేటితో ముగియనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు కొత్తగా నియమితులైన ప్రత్యేక కార్యనిర్వాహక న్యాయాధికారి (SEM) ఎదుట హాజరుపరచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విచారణ నిర్ణీత సమయానికి ప్రారంభమవుతుందని, ఎలాంటి జాప్యం జరగదని ఆశిస్తున్నట్లు రత్నా సింగ్ పేర్కొన్నారు.
గతంలోనూ విచారణకు సంబంధించి పలు అవరోధాలు ఎదురయ్యాయని ఆమె గుర్తుచేశారు. దర్యాప్తు అధికారి గంటల తరబడి అందుబాటులో లేకపోవడం, బెదిరింపు సందేశాలు రావడం, విచారణ ఆలస్యంగా జరగడం, వాహనం టైరు పంక్చర్ కావడంతో నిందితులను సమయానికి హాజరుపరచడంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటం వంటి ఘటనలను ప్రస్తావించారు. ఈసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని, ఇకపై ‘పై నుంచి ఆదేశాలు’ ఉండకూడదని ఆమె వ్యాఖ్యానించారు. సౌరవ్ దాస్, అశుతోష్ రంకా కేసులో తదుపరి పరిణామాలపై సిటిజెన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ న్యాయ బృందం దృష్టి సారించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!