
గాసిప్స్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ దాదాపు 25,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించడం బీఆర్ఎస్కు భారీ షాక్‌గా మారింది. హైదరాబాదులో అత్యంత ప్రభావవంతంగా ఉన్న ఈ అడ్డాలో బీఆర్ఎస్ ఓటమి పాలవడం పార్టీకి ప్రతిష్టాత్మక పరాభవంగా భావిస్తున్నారు. ఈ ఫలితంపై బీఆర్ఎస్కు దూరంగా ఉన్న కవిత స్పందిస్తూ X (ట్విట్టర్)లో “Karma hits back” అంటూ పోస్ట్ చేశారు.
ఈ వ్యాఖ్య స్పష్టంగా బీఆర్ఎస్ నాయకత్వం, ముఖ్యంగా కెటీఆర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్టుగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఆమె పోస్ట్ వేగంగా వైరల్ అవ్వడంతో బీఆర్ఎస్లో జరుగుతున్న అంతర్గత ఉద్రిక్తతలు మరింత బయటపడ్డాయి.


















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!