
బిజినెస్

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ రాజకీయాల్లోకి రావాలని ఆలోచిస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంపై ప్రజల అభిప్రాయాన్ని కోరుతూ తన ఎక్స్ ఖాతాలో వీడియోను విడుదల చేశారు. ప్రజలు, అభిమానులు ఆమోదిస్తేనే రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని, లేకపోతే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ తెలిపారు.
గత కొన్ని రోజులుగా తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నికలో లారెన్స్ పోటీ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ప్రకటనతో అభిమానులు, రాజకీయ వర్గాల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!