
సినిమాలు

వచ్చే నెల 4 నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి సీఎం ప్రచార షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వచ్చే నెల 4 నుంచి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. తొలి సభగా వచ్చే నెల 4 న మిర్యాలగూడలో నిర్వహించే ప్రచార సభలో సీఎం పాల్గొంటారు.
అనంతరం వచ్చే నెల 5 న కరీంనగర్ జిల్లా చొప్పదండిలో, వచ్చే నెల 6 న నిజామాబాద్ రూరల్లో, వచ్చే నెల 7 న వికారాబాద్ జిల్లా పరిగిలో, వచ్చే నెల 8 న భూపాలపల్లిలో ఎన్నికల ప్రచార సభల్లో సీఎం పాల్గొననున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రచార వ్యూహాన్ని అమలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!