
టెక్నాలజీ

బళ్లారి స్థానిక ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి గతంలో ప్రశాంతంగా ఉన్న బళ్లారి నియోజకవర్గాన్ని అక్రమాల నిలయంగా మార్చారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. గత 30 ఏళ్లుగా శాంతియుతంగా ఉన్న బళ్లారిని ఇప్పుడు బీహార్లా తయారు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. బళ్లారిలో ఎమ్మెల్యే చేయని దందా లేదని ఆరోపిస్తూ, అక్రమ కార్యకలాపాలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు.
అదేవిధంగా ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి, ఆయన తండ్రి సూర్యనారాయణ రెడ్డి వ్యవహార శైలి ఫ్యాక్షన్ సినిమాలను తలపిస్తోందని గాలి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఇటీవల జరిగిన గొడవపై తాను కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. తనపై దాడి జరిగితే దేశవ్యాప్తంగా పేరు వస్తుందన్న ఉద్దేశంతోనే భరత్ రెడ్డి ఈ తరహా ప్రవర్తనకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!