
గాసిప్స్

బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ను పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 19 న బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుండగా, సాయంత్రం 4 గంటల నుంచి వాటి పరిశీలన చేపడతారు. అనంతరం సాయంత్రం 6 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని వెల్లడించారు.
ఈ విషయాలను బీజేపీ జాతీయ ఎన్నికల అధికారి, తెలంగాణ బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ వెల్లడించారు. ఆయన ప్రకారం, ఈ నెల 20 న బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అధికారికంగా నిర్వహించనున్నారు. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియ సాగుతుందని డాక్టర్ లక్ష్మణ్ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!