

కోలీవుడ్లో టూరిస్ట్ ఫ్యామిలీ వంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామాతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అబీషీన్ జీవింత్ హీరోగా నటించిన తాజా రొమాంటిక్ కామెడీ చిత్రం విత్ లవ్ ఇప్పుడు ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. టాలీవుడ్లో ఛాంపియన్ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన అనస్వర రాజన్ ఈ చిత్రంలో హీరోయిన్గా నటించింది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. మార్చి 6 నుంచి పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది. థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు ఇంట్లోనే ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ను ఆస్వాదించవచ్చు. ఈ చిత్రానికి సియన్ రోల్డన్ సంగీతం అందించగా, ఎంఆర్పి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ బాధ్యతలు నిర్వహించింది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!