

ఇటీవలి కాలంలో వచ్చిన తెలుగు రోమ్-కామ్ చిత్రాల్లో ‘పతంగ్’ ప్రత్యేకంగా నిలిచింది. ప్రవీణ్ ప్రత్తిపాటి దర్శకత్వంలో కొత్త నటీనటులతో పాటు కొంతమంది సీనియర్ ఆర్టిస్టులు నటించిన ఈ చిత్రం యువతలో మంచి ఆదరణ పొందింది. అయితే భారీ పోటీ కారణంగా థియేటర్లలో పెద్దగా రీచ్ సాధించలేకపోయింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులు సన్ నెక్స్ట్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఈ నెల 30 నుంచి అందుబాటులో ఉంటుంది అని వారు కన్ఫర్మ్ చేశారు. సో ఈ ఫన్ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు రేపటి నుంచి ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రణవ్ కౌశిక్, వంశీ పుజిత్, ప్రీతీ పగడాల, ఎస్ పి చరణ్, ఎస్ ఎస్ కాంచి, గౌతమ్ మీనన్ లాంటి ప్రముఖులు కూడా నటించడం విశేషం. ఇక ఈ చిత్రానికి జోస్ జిమ్మీ సంగీతం అందించగా విజయ్ శేఖర్ అన్నే, సంపత్ మాక, సురేష్ రెడ్డి కొత్తింటి, నాని బండ్రెడ్డి లు నిర్మాణం వహించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!