

సినీప్రపంచం ఎంతగానో ఎదురుచూసిన ఆస్కార్ వేడుక ఘనంగా జరిగింది. ఈ రోజు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో ఉన్న డాల్బీ థియేటర్లో 98 వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్” చిత్రం అత్యధికంగా ఆరు అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు, కాస్టింగ్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో ఈ సినిమా అవార్డులు సాధించింది. అలాగే “సిన్నర్స్” సినిమా నాలుగు అవార్డులు (ఉత్తమ నటుడు, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, ఒరిజినల్ స్కోర్) గెలుచుకుని రెండో స్థానంలో నిలిచింది.
ఈ ఆస్కార్ గెలిచిన సినిమాలు పలు ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా అందుబాటులో ఉన్నాయి. “వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్”, “సిన్నర్స్”, “వెపన్స్” సినిమాలు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతున్నాయి. “ఫ్రాంకెన్‌స్టీన్” మరియు యానిమేటెడ్ చిత్రం “కెపాప్ డిమాన్ హంటర్స్” నెట్‌ఫ్లిక్స్‌లో చూడొచ్చు. “F1” సినిమా యాపిల్ టీవీలో ఉంది. “సెంటిమెంటల్ వాల్యూ” అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీలలో అద్దెకి లభిస్తోంది. “హామ్నెట్” కూడా యాపిల్ టీవీలో అద్దెకు అందుబాటులో ఉంది. అయితే “అవతార్: ఫైర్ అండ్ యాష్” సినిమా ఇంకా ఓటీటీలో విడుదల కాలేదు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!