
క్రీడలు

ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘మనీ హిస్ట్’ సిరీస్ అభిమానులకు నెట్‌ఫ్లిక్స్ భారీ సర్ప్రైజ్ ఇచ్చింది. ఐదో సీజన్‌తో ఈ సిరీస్ ముగిసినప్పటికీ, ‘మనీ హిస్ట్’ ప్రపంచాన్ని మరింత విస్తరించనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విడుదల చేసిన కొత్త టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే ‘బెర్లిన్’ పాత్ర ఆధారంగా వచ్చిన స్పిన్ఆఫ్ మంచి స్పందన అందుకోవడంతో అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది.
అయితే ఇది ఆరో సీజనా లేదా కొత్త పాత్రలతో మరో కథనా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ‘ప్రొఫెసర్’ సహా పాత పాత్రలతో కొత్త సిరీస్ ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తామని నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. దీంతో ‘మనీ హిస్ట్’ అభిమానులు కొత్త అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!