
సినిమాలు

నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన అనగనగా ఒక రాజు సినిమా ఈ రోజు నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంది . ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల అయింది. ఇప్పటికే థియేటర్లలో విడుదలై మంచి స్పందన పొందిన ఈ సినిమా, ఓటీటీలో కూడా ఉత్సాహభరితమైన వినోదాన్ని ప్రేక్షకులకు అందించబోతుందనే అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు అందుబాటులో ఉంటుంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ చిత్రానికి మారి దర్శకత్వం వహించారు. మిక్కీ జె. మేయర్ సంగీతం అందించారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా రూపొందిన అనగనగా ఒక రాజు ఓటీటీ విడుదలతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!