

మన శంకర వర ప్రసాద్ గారు మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. మెగా విక్టరీ ఫ్యాన్స్ అందరికీ నమస్కారం. చిరంజీవి గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఇది మామూలుగా లేదు. ఆయన రఫ్ ఆడేస్తారు. నేను కూడా ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ అని రఫ్ ఆడాను ఇద్దరం రఫ్ఫాడాం. రచ్చ రచ్చే. నేను మా తమ్ముళ్ళు పవన్ కళ్యాణ్ తో మహేష్ తో మల్టీ స్టార్స్ చేశాను. ఇప్పుడు అన్నయ్యతో చేస్తున్నాను. సౌండ్ ఇంకా గట్టిగా ఉండాలి. ఇదే సంక్రాంతి స్పిరిట్. అనిల్ తో నాది వండర్ఫుల్ కాంబినేషన్. అన్ని సినిమాలు మీరు సూపర్ హిట్ చేశారు.
తన రైటింగ్ టీం, టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి ఫ్యామిలీ ఫిలిం, మంచి ఎంటర్టైన్మెంట్ ఫిలిం సంక్రాంతికి వస్తోంది. ఎప్పటిలాగే మీరు దాన్ని అద్భుతంగా ఆదరించి మంచి హిట్ చేస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతి ఫిలిమ్స్ అన్ని చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీ బాగుపడాలంటే అన్ని సినిమాలు ఆడాలి. మీరు అన్ని సినిమాలు చూసి బాగా ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని వెంకటేష్ అన్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!