

అధిరా టాకీస్ బ్యానర్‌పై, 100కి పైగా సినిమాలకు పని చేసిన సినిటారియ మీడియా వర్క్స్ మద్దతుతో, దర్శకుడు శ్రీనివాస్ (బుజ్జి) రూపొందిస్తున్న క్రైమ్ మరియు సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం “వైఫ్”. ఇందులో నరేన్ తేజ్, సుహాన ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి మురళీ కృష్ణ వర్మ, సంగీతానికి సత్య కాశ్యప్, ఎడిటింగ్‌కు నందమూరి హరి బాధ్యతలు వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుల సమక్షంలో ఈ చిత్రానికి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ఘనంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ప్రముఖ దర్శకుడు చంద్ర మహేష్ మాట్లాడుతూ, “మీడియా సపోర్ట్ చూస్తుంటే సినిమా విజయవంతం అవుతుందనే నమ్మకం కలుగుతోంది. ‘వైఫ్’ అనే టైటిల్ భర్తకు, కుటుంబానికి బలం ఇచ్చే అర్థంతో చాలా అర్థవంతంగా ఉంది. సినిటారియ మీడియా వర్క్స్ వెంకట్ గారి మద్దతు సినిమాకు మరింత బలాన్నిస్తుంది” అన్నారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరి జీవితంలో వైఫ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. టైటిల్ చాలా సరైనది. ప్రతిభావంతులైన టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నాను” అన్నారు. నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ, “సినిటారియ మీడియా వర్క్స్ వెంకట్ గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. కె మ్యూజిక్ వారు పాటల హక్కులు పొందడం విశేషం. మంచి సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రచారం కీలకం” అన్నారు.
దర్శకుడు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ, “నా తల్లిదండ్రులకు, రాంగోపాల్ వర్మ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఒక షెడ్యూల్ పూర్తయింది. ‘వైఫ్’ ఒక క్రైమ్ & సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. మా టీమ్ కృషికి కృతజ్ఞతలు. త్వరలో తదుపరి షెడ్యూల్ ప్రారంభిస్తాము. మీడియా మద్దతు కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు. సినిటారియ మీడియా వర్క్స్ సీఈఓ వెంకట్ మాట్లాడుతూ, “నేటి జనరేషన్‌కు నచ్చే విధంగా ఈ సినిమా రూపొందుతోంది. అందరికీ నా కృతజ్ఞతలు” అన్నారు. హీరోయిన్ సుహాన మాట్లాడుతూ, “నా పాత్ర చాలానే ఛాలెంజింగ్‌గా ఉంది. సినిమా ఆసక్తికరమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అన్నారు. హీరో నరేన్ తేజ్ మాట్లాడుతూ, “ఐటీ రంగం వదిలి సినిమాల్లోకి వచ్చాను. మంచి కథతో, బుజ్జి గారి దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాను. ఈ సినిమా తప్పక ప్రేక్షకుల హృదయాలను గెలుస్తుందని నమ్ముతున్నాను” అన్నారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రాఫర్ మురళీ కృష్ణ వర్మ, సంగీత దర్శకుడు సత్య కాశ్యప్, కె మ్యూజిక్ ప్రియాంక తదితరులు హాజరై, సినిమా విజయంపై నమ్మకం వ్యక్తం చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!